Sri Subrahmanyeswara Golingeswara swamy temple , Bikkavolu, Andhra Pradesh 533343
Sri Subrahmanyeswara Golingeswara swamy temple , Bikkavolu, Andhra Pradesh 533343
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర గోలింగేశ్వర స్వామి దేవాలయం, బిక్కవోలు, ఆంధ్రప్రదేశ్ 533343
Maps
Hightlight
- Bus Facility
- Parking
- Taxi
More Information
- Temple History Sthala Purana Devasthanam of Sri Golingeswara Swamy, Bikavolu With a history of 1,100 years, Bikavulu is one of the oldest Kshetras in Andhra Pradesh. Bikavulu on the banks of the Godavari has rich spiritual history and is famous for its many ancient temples built in Eastern Chalukya splendor. This field was first called 'Vikramapuram' after Chalukya Vikram, then it was called 'Birudankinavolu' during the reign of Gunaga Vijayaditya III, who was known as Vijayaditya III, in AD 849-892 and later renamed as 'Bikkavolu'. Today, six temples in this village of Bikavolu stand witness to the sculptural art of the Chalukyas of yesteryear. In this area, the cows of Srivatsavai Suryanarayana Thimmajagapati Maharaja used to go to the ruins of the temple and milk in the cowherd there. The king came to know about it through the cowherds, and when the soil was dug there, three Shiva temples were found at that place. The complex of three Shiva temples visited by the whole family at one place is known as 'Trilingakshetram'. Due to being trodden by cow's feet and anointed with cow's paws, the Lord who was known as Vijayeshwar in the inscriptions is today known as Golingeshwar Swami. In the same temple, Goddess Deveri Sri Parvati, Sri Kumara Subrahmanyeshwara Swami are facing south, Sri Vijaya Ganapati Swami, Sri Bhadrakali and Veerabhadreswara Swami are facing north. On both sides of this temple are Sri Chandrasekhara Swamy, Sri Rajarajeswara Swamy Warla Temples are in one Prakaram. In the temple of Sri Golingeswara Swamy, Sri Kumara Subrahmanyeshwara Swamy is measured as a Brahmachari. To the right of Swami there is a natural mound. As Sri Kumara Swami is facing South as in Palani Kshetra, it is special here that as soon as Sri Kumara Swami was visited and abhishekam was performed, all the wishes of the household were fulfilled due to the grace of Vishwadipati Swami. It is believed that the dosha cure pujas performed for the peace of Rahu, Ketu, Kuja and Grahasanti in this temple which is known as Angaraka Kshetra will help many people get marriage readiness, children, financial loss and physical ailments. Every year on the day of Margasira Shuddha Shashti, Sri Kumaraswamy's Shashti Mahotsavam is celebrated with great grandeur. It is strongly believed that on this day childless women will become fertile if they sleep prostrate wearing a Nagula sari placed on the mat and the Lord facing them. On the day of Shashti, lakhs of devotees visit the Lord and receive Tirdhaprasadams. Festivals, Pujadi programs and Kalyana Mahotsavam are held in the temple of Sri Swamivari according to Smartha Agama... స్థల పురాణం శ్రీ గోలింగేశ్వర స్వామి వారి దేవస్థానం, బిక్కవోలు 1,100 సంవత్సరాల చరిత్ర ఉన్న బిక్కవోలు ఆంధ్రప్రదేశ్ లోని అతి ప్రాచీన క్షేత్రాలలో ఒకటి. గోదావరి తీరం లో ఉన్న బిక్కవోలు గొప్ప ఆధ్యాత్మిక చారిత్రక విశేషాలు కలిగి, తూర్పు చాళుక్యుల వైభవముతో నిర్మించబడ్డ అనేక పురాతన ఆలయాలకు ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రం మొదట చాళుక్య విక్రముని పేరిట 'విక్రమపురం' గాను, మూడవ విజయాదిత్యునిగా పిలువబడిన గుణగ విజయాదిత్యునికాలం క్రీ.శ.849-892 లో 'బిరుదాంకినవోలు' గాను పిలువబడి, కాలగమనం లో 'బిక్కవోలు' గా నామాంతరం చెందింది. నేటికి ఈ బిక్కవోలు గ్రామంలో ఆరు దేవాలయాలు అలనాటి చాళుక్యుల శిల్ప కళావైభవానికి సాక్షిభూతంగా నిలుస్తున్నాయి. ఈ ప్రాంతంలో, శ్రీవత్సవాయి సూర్యనారాయణ తిమ్మజగపతి మహారాజు గారి గోవులు దేవాలయ శిథి లాలపైకి వెళ్ళి అక్కడ ఉన్న పుట్టలో పాలు విడిచేవి. ఆ విషయం పశువుల కాపరుల ద్వారా రాజు కి తెలిసి, అక్కడ మట్టిని తవ్వించగా, ఆ ప్రదేశంలో మూడు శివాలయాలు బయటపడ్డాయి. ఒక ప్రదేశంలో సకుటుంబ సపరివారంగా దర్సనమిస్తున్న మూడు శివాలయాల సముదాయాన్ని 'త్రిలింగక్షేత్రం'గా పిలుస్తారు. గోవు పాదాలతో తొక్కబడుట చేత, గోవుపాలతో అభిషేకించడం వలన అప్పటివరకు విజయేశ్వరునిగా శాసనాలలో పిలువబడ్డ స్వామి నేడు గోలింగేశ్వర స్వామి గా పిలవబడుతున్నారు. ఇదే ఆలయంలో దేవేరి శ్రీ పార్వతి అమ్మవారు, శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు దక్షిణముఖంగా, శ్రీ విజయ గణపతి స్వామి వారు, శ్రీభద్రకాళీ సమేత వీరభద్రేశ్వర స్వామి వారు ఉత్తర ముఖంగాను కొలువుదీరి వున్నారు. ఈ ఆలయం ఇరుప్రక్కలా శ్రీ చంద్రశేఖర స్వామి వారు, శ్రీరాజరాజేశ్వర స్వామి వార్ల ఆలయాలు ఒకే ప్రాకారంలో ఉంటాయి. శ్రీ గోలింగేశ్వర స్వామి వారి ఆలయములో శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు బ్రహ్మచారిగా కొలవబడుచున్నారు. స్వామి వారికి కుడివైపున సహజసిద్ధమైన పుట్ట ఉన్నది. శ్రీ కుమార స్వామి పళని క్షేత్రంలో వలెనే దక్షిణ ముఖముగా కొలువైయున్నందున శ్రీ స్వామివారిని దర్శించి అభిషేకములు జరిపించినంతనే విశ్వాదిపతియైన స్వామి అనుగ్రహం వలన సకల గృహశాంతి జరిగి కోరిన కోర్కెలు నెరవేరడం ఇక్కడ విశేషం. ప్రత్యేకించి అంగారక క్షేత్రముగా పిలువబడే ఈ దేవాలయములో రాహు, కేతు, కుజ, గ్రహశాంతిని కోరి జరిపించే దోష నివారణ పూజల వలన అనేకమందికి వివాహసిద్ధి, సంతానం, నష్టద్రవ్య ప్రాప్తి, శారీరక ఈతిబాధల నుండి పరిహారం లభిస్తుందని ప్రజల నమ్మకం. ప్రతీ సంవత్సరం మార్గశిర శుద్ధ షష్టి రోజున శ్రీ కుమారస్వామి వారి షష్టి మహోత్సవములు అత్యంత వైభవముగా జరుపబడతాయి. ఈ రోజున సంతానం లేని మహిళలు పుట్టపై ఉంచిన నాగుల చీర ధరించి స్వామి వారి వైపు శిరస్సు ఉంచి సాష్టాంగంగా నిద్రించడం వలన సంతానవంతులు అవుతారని ప్రగాఢ నమ్మకం. షష్టి రోజున లక్షలాది మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించి తీర్ధప్రసాదములు స్వీకరించెదరు. శ్రీ స్వామివారి ఆలయంలో ఉత్సవములు, పూజాది కార్యక్రమములు, కళ్యాణ మహోత్సవములు స్మార్థ ఆగమము ప్రకారము జరుగును.
- Sub Temples 🛕Sri Golingeswara Swamy 🛕Sri Vijaya Ganapathi 🛕Sri Badrakali Sametha Veera Bhadra Swamy 🛕Sri Kumara Subramanya Swamy 🛕Sri Parvathi Ammavaru 🛕శ్రీ గోలింగేశ్వర స్వామి 🛕శ్రీ విజయ గణపతి 🛕శ్రీ భద్రకాళి సమేత వీర భద్ర స్వామి 🛕శ్రీ కుమార సుబ్రహ్మణ్య స్వామి 🛕శ్రీ పార్వతి అమ్మవారు
- Things to Cover 🙏🏼Take darshan of Sri Golingeswara Swamy , Vijaya Ganapathi , Sri Bhadrakali Sametha Veera Bhadra Swamy , Sri Kumara Subramanya Swamy , Sri Parvathi ammavaru 🙏🏼శ్రీ గోలింగేశ్వర స్వామి , విజయ గణపతి , శ్రీ భద్రకాళీ సమేత వీర భద్ర స్వామి , శ్రీ కుమార సుబ్రహ్మణ్య స్వామి , శ్రీ పార్వతి అమ్మవారు దర్శనం చేసుకోండి
- Dress Code 🥻Traditional Dress🥻సాంప్రదాయ దుస్తులు
- Pooja Details Panchamrutha Abhishekam will be performed to the deity on every Tuesday. The five-day annual festival will be celebrated during Subramanya Sasti. As deity here in the temple is facing towards the south so worshipping the deity will reduce the malefic effects from Kuja and Rahu Dosha. Naga Dosha Pooja will be performed here at this temple. ప్రతి మంగళవారం అమ్మవారికి పంచామృత అభిషేకం నిర్వహిస్తారు. సుబ్రహ్మణ్య సస్తి సందర్భంగా ఐదు రోజుల వార్షిక ఉత్సవాలు జరుపుకుంటారు. ఇక్కడి ఆలయంలో దేవత దక్షిణం వైపు ఉన్నందున ఈ దేవతను పూజించడం వల్ల కుజ మరియు రాహు దోషాల నుండి వచ్చే దుష్ఫలితాలు తగ్గుతాయి. ఈ ఆలయంలో ఇక్కడ నాగ దోష పూజ నిర్వహిస్తారు.
- Travel Guide 🚍 The direct bus to Bikkavolu is available from the major bus points at Kakinada and Rajahmundry with high frequency 🚉The nearest major junction is at Kakinada which is 30 km away Next, nearest is at Rajahmundry which is 34 km away. 🚍 అధిక ఫ్రీక్వెన్సీతో కాకినాడ మరియు రాజమండ్రి ప్రధాన బస్ పాయింట్ల నుండి బిక్కవోలుకు నేరుగా బస్సు అందుబాటులో ఉంది. 🚉సమీప ప్రధాన జంక్షన్ కాకినాడలో 30 కి.మీ దూరంలో ఉంది తరువాత, సమీప రాజమండ్రి 34 కి.మీ దూరంలో ఉంది.
Opening Hours
Monday:
6:00 AM - 1:00 PM & 4:00 PM - 8:00 PM
Tuesday:
6:00 AM - 1:00 PM & 4:00 PM - 8:00 PM
Wednesday:
6:00 AM - 1:00 PM & 4:00 PM - 8:00 PM
Closed
Thursday:
6:00 AM - 1:00 PM & 4:00 PM - 8:00 PM
Friday:
6:00 AM - 1:00 PM & 4:00 PM - 8:00 PM
Saturday:
6:00 AM - 1:00 PM & 4:00 PM - 8:00 PM
Sunday:
6:00 AM - 1:00 PM & 4:00 PM - 8:00 PM
FAQ's
Do we have parking?
Yes
Are there any other temples near by?
Bikkavolu Ganpathi temple is close to this temple