Sri Ranganatha Swamy Temple , Andole, Telangana ,502273
Sri Ranganatha Swamy Temple , Andole, Telangana ,502273
శ్రీ రంగనాథ స్వామి దేవాలయం, ఆందోల్, తెలంగాణ, 502273
Maps
Hightlight
- Bus Facility
- Parking
More Information
- Temple History Andol Ranganathaswamy Temple in Sangareddy District is one of the ancient shrines in Telugu states. In this temple, which has a history of hundreds of years, Lord Nagendra is worshiped in a reclining posture. With high gopurams and a beautiful sculptural entrance, this temple chants 'Om Namo Narayanaya' every Saturday in remembrance of Lord Swami. A local myth... It is said that Vishnumurthy, the master of the Jagannatak, was thrilled by the services of the devotees in the Treta Yuga and left Devaloka first to Ayodhya, then to Srirangan on the banks of the Kaveri river in the south, and then to Andalupuran on the Garudadri. Over time, Andalupuram, Andalapuram, Andolappuranga, that became today's Andol. Built on an area of one and a half acres, this temple was built in the 15th century by King Shauryaraminedu who ruled Kalpaguru. An idol of Ranganathaswamy was brought from Srirangam and enshrined in the temple. Later he shifted his headquarters from Kalpagur to Andol and expanded the kingdom. In the 18th century, Rani Shankaramma, who ruled Andol, further developed this temple. Special features of the temple... Usually in any temple there are ceremonial idols of Swami himself in the sanctum sanctorum. But here the ceremonial idols appear in the form of Lord Krishna accompanied by Rukmini and Satyabhama. There are three koners and five cheda wells in the temple premises. In this, the big gundam with four gates to the north-east of the temple is important. The water in it is purified from time to time by the adjacent Sriranga Sagar (Andol pond). Devotees believe that if they bathe in it and circumambulate around the Lord, all diseases will be cured. On the top of the temple is a unique gold-plated chakra with 108 petals. It is said that if you do not have a darshan of Swami, if you do this Chakradarshan, you will get the merit of worshiping Ranganatha and attain salvation. Dhanurmasa Seva and Swami's Kalyana Ghattam are held annually in the temple in the month of Pushya. Vinayaka Navratri, Gokulashtami, anniversaries and Garudavahanaseva are held grandly. Devotees come from all over to witness these ceremonies. How to reach... This temple is at a distance of 28 km from Sangareddy district headquarters. From there you can reach Andol by buses and private vehicles. From Hyderabad, you can take Medak and Narayankhed buses (Via- Sangareddy) and go to this temple which is located next to National Highway 161. తెలుగురాష్ట్రాల్లోని ప్రాచీన పుణ్యక్షేత్రాల్లో సంగారెడ్డి జిల్లాలోని అందోల్ రంగనాథస్వామి ఆలయం ఒకటి. వందల ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో నాగేంద్రుడిపైన శయన భంగిమలో కొలువుదీరిన స్వామి భక్తవత్సలుడిగా విరాజిల్లుతున్నాడు. ఎత్తైన గోపురాలూ, ఇంపైన ముఖద్వారంతో చక్కని శిల్పకళతో అలరారుతున్న ఈ క్షేత్రం ప్రతి శనివారం ‘ఓం నమో నారాయణాయ' అంటూ స్వామి స్మరణతో మార్మోగుతుంది. స్థల పురాణం... జగన్నాటక సూత్రధారి అయిన విష్ణుమూర్తి త్రేతాయుగంలో భక్తుల సేవలకు పులకించిపోయి దేవలోకం విడిచి మొదట అయోధ్యకూ, ఆ తర్వాత దక్షిణాన కావేరి నదీ తీరంలో ఉన్న శ్రీరంగానికీ, ఆ తర్వాత గరుడాద్రి మీద అండాళుపురానికీ వచ్చాడని చెబుతుంటారు. కాలక్రమంలో అండాళుపురం, అందాలపురం, అందోలప్పురంగా, అదే నేటి అందోల్ గా మారిందట. ఒకటిన్నర ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఆలయాన్ని 15వ శతాబ్దంలో కల్పగూరును పాలించిన రాజు శౌర్యరామినేడు కట్టాడట. శ్రీరంగం నుంచి రంగనాథస్వామి విగ్రహాన్ని తీసుకొచ్చి దేవాలయంలో ప్రతిష్ఠించాడట. తర్వాత తమ సంస్థానాన్ని కల్పగూరు నుంచి అందోల్కు మార్చి రాజ్యాన్నివిస్తరించాడు. 18వ శతాబ్దంలో అందోల్ని పాలించిన రాణి శంకరమ్మ ఈ దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేసింది. ఆలయ ప్రత్యేకతలు... సాధారణంగా ఏ దేవాలయంలోనైనా గర్భగుడిలో కొలువై ఉన్న స్వామివే ఉత్సవ విగ్రహాలూ ఉంటాయి. కానీ ఇక్కడ ఉత్సవ విగ్రహాలు రుక్మిణీ, సత్యభామా సహితుడైన శ్రీకృష్ణుడి రూపంలో దర్శనమిస్తాయి. ఆలయ ప్రాంగణంలో మూడు కోనేరులూ, ఐదు చేద బావులూ ఉంటాయి. ఇందులో గుడికి ఈశాన్యాన నాలుగు ద్వారాలతో ఉండే పెద్ద గుండం ముఖ్యమైంది. పక్కనే ఉన్న శ్రీరంగ సాగరం(అందోల్ చెరువు) ద్వారా దీంట్లోని నీరు ఎప్పటికప్పుడు శుద్ధి అవుతుంటాయి. ఇందులో స్నానం చేసి స్వామి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే సర్వరోగాలూ నయమవుతాయని భక్తుల నమ్మకం. ఆలయ శిఖరంపైన 108 రేకులతో ప్రత్యేకమైన బంగారుపూత చక్రం ఉంటుంది. స్వామి దర్శనం కాకపోయినా ఈ చక్రదర్శనం చేసుకుంటే రంగనాథుడిని పూజించిన పుణ్యం వస్తుందనీ, మోక్షం సిద్ధిస్తుందనీ చెబుతారు. ఆలయంలో ఏటా పుష్యమాసంలో చేసే ధనుర్మాస సేవా, స్వామివారి కల్యాణ ఘట్టం కన్నుల పండువగా జరుగుతాయి. వినాయక నవరాత్రులూ, గోకులాష్టమీ, వార్షికోత్సవాలూ, గరుడవాహనసేవా ఘనంగా నిర్వహిస్తుంటారు. ఈ వేడుకల్ని చూడ్డానికి భక్తులు ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. ఎలా చేరుకోవచ్చు... ఈ ఆలయం సంగారెడ్డి జిల్లా కేంద్రానికి 28 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడి నుంచి బస్సుల్లో, ప్రయివేటు వాహనాల్లో అందోల్కు చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి మెదక్, నారాయణఖేడ్ బస్సులు (వయా- సంగారెడ్డి) ఎక్కి జాతీయ రహదారి 161కి పక్కనే ఉన్న ఈ ఆలయానికి వెళ్లొచ్చు.
- Sub Temples 🛕Sri Ranganadha Swamy Temple 🛕Sri Hanuman Temple 🛕శ్రీ రంగనాధ స్వామి ఆలయం 🛕శ్రీ హనుమాన్ దేవాలయం
- Things to Cover 🙏🏼Take darshan & blessings of Sri Ranganadha Swamy & Lord Hanuman. 🙏🏼శ్రీ రంగనాధ స్వామి & హనుమంతుని దర్శనం & ఆశీస్సులు పొందండి.
- Dress Code 🥻Traditional Dress🥻సాంప్రదాయ దుస్తులు
- Travel Guide This temple is at a distance of 28 km from Sangareddy district headquarters. From there you can reach Andol by buses and private vehicles. From Hyderabad, you can take Medak and Narayankhed buses (Via- Sangareddy) and go to this temple which is located next to National Highway 161. ఈ ఆలయం సంగారెడ్డి జిల్లా కేంద్రానికి 28 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడి నుంచి బస్సుల్లో, ప్రయివేటు వాహనాల్లో అందోల్కు చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి మెదక్, నారాయణఖేడ్ బస్సులు (వయా- సంగారెడ్డి) ఎక్కి జాతీయ రహదారి 161కి పక్కనే ఉన్న ఈ ఆలయానికి వెళ్లొచ్చు.
Opening Hours
Monday:
6:00 AM - 11:00 AM & 5:00 PM - 8:00 PM
Tuesday:
6:00 AM - 11:00 AM & 5:00 PM - 8:00 PM
Wednesday:
6:00 AM - 11:00 AM & 5:00 PM - 8:00 PM
Thursday:
6:00 AM - 11:00 AM & 5:00 PM - 8:00 PM
Closed
Friday:
6:00 AM - 11:00 AM & 5:00 PM - 8:00 PM
Saturday:
6:00 AM - 11:00 AM & 5:00 PM - 8:00 PM
Sunday:
6:00 AM - 11:00 AM & 5:00 PM - 8:00 PM
FAQ's
Do we have parking?
Yes, there is parking available