Sri Bramarambha Mallikarjuna Swamy Devasthanam , Beerumguda , Hyderabad
Sri Bramarambha Mallikarjuna Swamy Devasthanam , Beerumguda , Hyderabad – History , Timgs, How to reach
శ్రీ బ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం , బీరంగూడ , హైదరాబాద్ – చరిత్ర , సమయాలు, ఎలా చేరుకోవాలి
Located in Beerumguda, Hyderabad, Sri Bramarambha Mallikarjuna Swamy Devasthanam is an important spiritual center devoted to Lord Shiva and Goddess Bramarambha Devi. The temple holds great religious significance for devotees of Shiva, offering regular abhishekams, archana, and special poojas during auspicious days like Maha Shivaratri, Karthika Masam, and Pradosham. Surrounded by a serene environment, this Shiva temple in Hyderabad serves as a place of devotion, meditation, and community worship, drawing visitors from Beerumguda and nearby areas throughout the year.
Maps
Hightlight
-
Airport
-
Bus Facility
-
Parking
-
Taxi
More Information
- Temple History Lord Shiva is the embodiment of Omkara. He is easily pleased by his devotees and is like a wish-fulfilling tree for them. Shiva is the only deity who manifests in both formless and embodied forms. To bestow knowledge and liberation through the worship of the formless and attributeless, the Lord, who is easily swayed by devotion, incarnated as Mallikarjuna Swamy on the Beeramguda hill. It is well known that wherever and however the Shiva Lingam is worshipped, it grants liberation to any living being. This temple, which is said to be comparable to the great pilgrimage site of Srisailam, is believed to date back to the 6th century. It flourished as a great pilgrimage center during the periods of the Badami Chalukyas, Rashtrakutas, Kalyani Chalukyas, and Kakatiya kings. Located on a hill north of Beeramguda village, in a vast area of natural beauty, this temple, which is considered equal to the Srisailam Sri Bramaramba Mallikarjuna Swamy temple, is said to have been the place where Sage Bhrigu performed penance in ancient times. Pleased by his devotion, Lord Mallikarjuna Swamy appeared before him. When the holy men requested that this place should always be accessible for devotees to have his darshan, the divine couple listened to their plea and manifested on this Beeramguda hill. As evidence of this, there are indications of a tunnel connecting the temple from the southwest direction to Srisailam. Furthermore, according to the accounts of elders and as described in the Srisaila Mahatyam text, it is said that the assembly of Indra (the assembly of the gods) used to take place here at night. The temple of Sri Mallikarjuna Swamy, along with Sri Bhramaramba, is located 30 yojanas away from Srisailam mountain. This is that very temple. During the rule of the Chalukyas, a Jain king named Immadi Jayasimha, belonging to the Bijjala dynasty, established his residence in Pottalakere (now known as Patancheru) from 1015 to 1042 AD. His queen, Nugguladevi, was a devout devotee of Lord Shiva and worshipped this deity. A debate arose regarding the ritual of washing the Lord's feet, involving Devara Dasamayya, a devotee of Shiva. The Jains opposed the invitation of Devara Dasamayya to this debate. A debate ensued between Devara Dasamayya and a Jain sage named Sarvaghna Nemi. The devotees of Shiva emerged victorious, and the Jains were defeated. Therefore, it is a prayer that all devotees participate in the Maha Shivaratri festival and become recipients of the Lord's grace. ఓంకార స్వరూపుడు శివుడు. అతడు భక్త సులభుడు. భక్తులపాలిట కల్పవృక్షము. సాకార నిరాకార స్వరూపాలతో సాక్షాత్కరించె దైవము శివుడొక్కడే. నిర్గుణ నిరాకారోపాసన ద్వారా జ్ఞానమోక్షములు అందించుటకై భక్తవశంకరుడు బీరంగూడ గుట్టపై మల్లికార్జున స్వామిగా అవతరించినాడు. శివలింగము ఎక్కడ ఏ విధముగా పూజింపబడినను, ఏ ప్రాణికైనను మోక్షప్రదమగునన్న విషయము ఎల్లరకు తెలిసినదే. శ్రీశైల మహాక్షేత్రమునకు సమతూగగల ఈ దేవాలయము 6వ శతాబ్ధమునకు సంబంధించినదని వినికిడి. బాదామి, చాళుక్యులు, రాష్ట్రకూటులు, కళ్యాణి చాళుక్యులు మరియు కాకతీయ రాజుల కాలమున ఒక గొప్ప పుణ్యక్షేత్రముగా వెలుగొందినది. బీరంగూడ గ్రామమునకు ఉత్తర దిశగా గల గుట్టపై ప్రకృతి సౌందర్యముతో సువిశాలమైన స్థలంలో వెలసిన సాక్షాత్ శ్రీశైల శ్రీ బ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయమునకు సమతూగగల ఈ దేవాలయము నందు పూర్వకాలములో భృగు మహర్షి తపస్సు చేసినప్పుడు వారి భక్తికి మెచ్చి శ్రీ మల్లికార్జున స్వామి ప్రత్యక్షమై ఇక్కడి ప్రాంతం భక్తులకు ఎల్లవేళలా దర్శన భాగ్యం ఉండవలెనని పుణ్య పురుషులు కోరగా అందుకు ఆది దంపతులు వారి మొరనాలకించి ఈ బీరంగూడ గుట్టపై వెలసినారని వినికిడి. అందుకు ఆధారంగా ఆలయానికి నైఋతి దిక్కు నుండి శ్రీశైలం వరకు సొరంగ మార్గం ఉన్నట్లు నిదర్శనములు కలవు. ఇంతేకాక ఇక్కడ రాత్రి వేళల యందు ఇంద్ర సభ (దేవసభ) జరుగుచుండేదని పెద్దల ఉవాచ మరియు శ్రీశైల మహత్యం అను గ్రంధంలో వివరించిన ప్రకారం శ్రీశైలం పర్వతమునకు 30 ఆమడల దూరంలో శ్రీ భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి దేవాలయం కలదు. అదే ఈ దేవాలయము. ఈ ప్రాంతము చాణిక్యుల పరిపాలనలో బిజ్జలుని వంశమునకు సంబంధించిన ఇమ్మడి జయసింహుడనే జైనరాజు 1015 సంవత్సరము నుండి 1042 సంవత్సరము వరకు పొట్టలకేరిలో (పొట్టలకేరి అనగా ఇప్పుడు పటాన్ చెరువుగా పిలువ బడుచున్నది) స్థిర నివాసము ఏర్పరుచుకొని ఉండెను. ఈ జయసింహుని భార్య పట్టపురాణియైన నుగ్గుళాదేవి మంచి శివభక్తురాలై ఈ స్వామిని పూజించినది మరియు పాదపూజకై శివశరణుడైన దేవర దాసమయ్యకు వాదన జరిగెను. ఈ వివాదమునందు దేవర దాసమయ్యను ఆహ్వానించినందున జైనులు వ్యతిరేకించిరి. జైనుల పక్షము నుండి సర్వఘ్ననేమి అను జైనమునికి దేవరదాసమయ్యకు వాదన జరిగెను. శివశరణులు శివశరణులు గెలుపొంది జైనులు పరాజితులైరి.కావున భక్తులందరు మహాశివరాత్రి ఉత్సవములో పాల్గొని శ్రీ స్వామి వారికృపకు పాత్రులు కాగలరని ప్రార్థన.
-
Sub Temples
🛕Lord Shiva
🛕Bramambha Devi
🛕Vinayaka
🛕Hanuma
🛕Nava Graha Temples
🛕Subramanya Swamy
🛕శివుడు
🛕భ్రమరాంబ దేవి
🛕వినాయక
🛕హనుమ
🛕నవగ్రహ దేవాలయాలు
🛕సుబ్రహ్మణ్య స్వామి -
Things to Cover
🙏🏼Take darshan & blessings of Lord Shiva, Bhramabha Devi , Hanuman, Subramanya Swamy and Vinayaka
🙏🏼శివుడు, భ్రమభా దేవి, హనుమంతుడు, సుబ్రహ్మణ్య స్వామి మరియు వినాయకుని దర్శనం & ఆశీస్సులు పొందండి
-
Dress Code
🥻Traditional Dress
🥻సాంప్రదాయ దుస్తులు -
Pooja Details
🌹 Archana - ₹50/-
🌹 Ammavari Kumkumarchana - ₹100/-
🌹 Swamy Vari Abhishekam - ₹250/-
🌹 Antralaya Abhishekam (Two persons only) - ₹650/-
🌹 Mahanyasa Purvaka Ekavarabhishekam - ₹1116/-
🌹 Swamy Vari Kalyanam on Masashivaratri day - ₹2500/-
🌹 Two-wheeler Pooja - ₹100/-
🌹 Vehicle Pooja (Car / Tractor) - ₹200/-
🌹 Vehicle Pooja (Lorry / Bus) - ₹500/-
🌹 Navagraha Pooja - ₹250/-
🌹 Permanent Annadanam Scheme
🌹 Donors who contribute ₹25,116/- are Patrons
🌹 Donors who contribute ₹51,116/- are Royal Patrons
🌹 Donors who contribute ₹1,01,116/- are Maharaja Patrons
Note: Annaprasadam is distributed every Monday at the temple.
🌹అర్చన - 50/-
🌹అమ్మ వారి కుంకుమార్చన - 100/-
🌹స్వామి వారి అభిషేకము - 250/-
🌹అంత్రాలయ అభిషేకము (ఇద్దరు మాత్రమే) - 650/-
🌹మహాన్యాసపూర్వక ఏకవారాభిషేకము - 1116/-
🌹మాసశివరాత్రి రోజున స్వామి వారి కళ్యాణము - 2500/-
🌹ద్విచక్ర వాహన పూజ - 100/-
🌹వాహన పూజ (కారు / ట్రాక్టరు) - 200/-
🌹వాహన పూజ ( లారీ / బస్సు) - 500/-
🌹నవగ్రహ పూజ - 250/-
🌹శాశ్వత అన్నదాన పధకం
🌹రూ॥ 25,116/- చెల్లిచిన దాతలు పోషకులు
🌹రూ॥ 51,116/- చెల్లించిన దాతలు రాజ పోషకులు
🌹రూ॥ 1,01,116/- చెల్లించిన దాతలు - మహారాజ పోషకులు
గమనిక: దేవాలయమునందు ప్రతి సోమవారం అన్నప్రసాద వితరణ -
Festivals / Jaatra
Following are the festivals celebrated :
🌹Maha Shivaratri: The grandest festival of the year, featuring day-long rituals, special Abhishekams, and thousands of devotees staying awake for Jagarana.
🌹Karthika Masam: Every Monday of this month is special, with Deepotsavam (lighting of lamps) illuminating the entire hill.
🌹Masa Shivaratri: Celebrated monthly with special Kalyanotsavam for the divine couple.
🌹Navaratri: Dedicated rituals for Goddess Brahmaramba during the Dussehra season.
జరుపుకునే పండుగలు క్రింది విధంగా ఉన్నాయి:
🌹మహా శివరాత్రి: ఇది సంవత్సరంలోనే అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ, ఇందులో రోజంతా పూజలు, ప్రత్యేక అభిషేకాలు మరియు వేలాది మంది భక్తులు జాగరణ కోసం రాత్రంతా మేల్కొని ఉంటారు.
🌹కార్తీక మాసం: ఈ మాసంలోని ప్రతి సోమవారం ప్రత్యేకమైనది, దీపోత్సవంతో కొండ మొత్తం కాంతులీనుతుంది.
🌹మాస శివరాత్రి: ప్రతి నెలా దైవ దంపతులకు ప్రత్యేక కల్యాణోత్సవంతో ఈ పండుగను జరుపుకుంటారు.
🌹నవరాత్రి: దసరా పండుగ సమయంలో బ్రహ్మరాంబ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. -
Travel Guide
🚌By Road: Beeramguda is located about 25 km from Hyderabad city center. It is well-connected by TSRTC buses (Route numbers like 219, 225, and 226). If driving, head toward Patancheru via the Mumbai Highway (NH65).
🚉By Rail: The nearest railway station is Lingampally (approx. 5–6 km). From here, you can easily find auto-rickshaws or app-based cabs to reach the temple base.
🛩️By Air: The Rajiv Gandhi International Airport (HYD) is approximately 50 km away. Travelers can take the ORR (Outer Ring Road) for a smooth 1-hour drive to the temple.
🚌రోడ్డు మార్గం ద్వారా: బీరంగుడ హైదరాబాద్ నగర కేంద్రం నుండి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది టీఎస్ఆర్టీసీ బస్సుల ద్వారా (219, 225, మరియు 226 వంటి రూట్ నంబర్లతో) చక్కగా అనుసంధానించబడి ఉంది. మీరు సొంత వాహనంలో ప్రయాణిస్తుంటే, ముంబై హైవే (NH65) మీదుగా పటాన్చెరు వైపు వెళ్ళండి.
🚉రైలు మార్గం ద్వారా: సమీప రైల్వే స్టేషన్ లింగంపల్లి (సుమారు 5–6 కి.మీ.). ఇక్కడి నుండి, ఆలయ ప్రాంగణానికి చేరుకోవడానికి మీరు ఆటో-రిక్షాలు లేదా యాప్ ఆధారిత క్యాబ్లను సులభంగా పొందవచ్చు.
🛩️విమాన మార్గం ద్వారా: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (HYD) సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రయాణికులు ఆలయానికి సులభంగా ఒక గంట ప్రయాణంలో చేరుకోవడానికి ఔటర్ రింగ్ రోడ్డు (ORR)ను ఉపయోగించుకోవచ్చు.
Opening Hours
Video
FAQ's
Do we have parking at this temple?
Yes, parking available at this temple
How to reach this temple?
By Road: Beeramguda is located about 25 km from Hyderabad city center. It is well-connected by TSRTC buses (Route numbers like 219, 225, and 226). If driving, head toward Patancheru via the Mumbai Highway (NH65). By Rail: The nearest railway station is Lingampally (approx. 5–6 km). From here, you can easily find auto-rickshaws or app-based cabs to reach the temple base. By Air: The Rajiv Gandhi International Airport (HYD) is approximately 50 km away. Travelers can take the ORR (Outer Ring Road) for a smooth 1-hour drive to the temple.
What are the festivals celebrated at this temple?
Maha Shivaratri: The grandest festival of the year, featuring day-long rituals, special Abhishekams, and thousands of devotees staying awake for Jagarana. Karthika Masam: Every Monday of this month is special, with Deepotsavam (lighting of lamps) illuminating the entire hill. Masa Shivaratri: Celebrated monthly with special Kalyanotsavam for the divine couple. Navaratri: Dedicated rituals for Goddess Brahmaramba during the Dussehra season.
Are there any other temples to visit ?
Venkateswara swamy Temple Saibaba Temple - Naa Shirdi



