Sri Sita Rama Chandra Swamy Devalayam , Ramagiri , NSP Camp Colony, Khammam Bypass Rd, Khammam, Telangana 507001
Sri Sita Rama Chandra Swamy Devalayam , Ramagiri , NSP Camp Colony, Khammam Bypass Rd, Khammam, Telangana 507001
శ్రీ సీతా రామ చంద్ర స్వామి దేవాలయం , రామగిరి , NSP క్యాంప్ కాలనీ, ఖమ్మం బైపాస్ రోడ్, ఖమ్మం, తెలంగాణ 507001
Maps
Contact
Hightlight
- Bus Facility
- Parking
More Information
- Temple History What Kadapa is like a gateway to Tirumala Kshetra is like a gateway to Sri Bhadrachal Kshetra. This is Khammam. This area which was glorified as Sambhadri in ancient times has rich historical background as Khammam Mettu. Stambhadri is the same hill where Lord Narasimhaswamy ascended. Janpada, which was formed as a step to climb that stambhadri, is known as Khammam Mettu and over time it flourished as Khammam city. Ramagiri is a large naturally formed hill at the back of that pillar. This cave was formed as Ramagiri Kshetra due to a divine event. There are three main reasons for the emergence of any Kshetra: the austerity of sages, the striving of great devotees, and the third is Bhagavatsankalpa. That Bhagavakatsankalpa is the main seed for the emergence of this Ramagiri field. In the year 1975, this Ramagiri area turned out to be a M.S.P camp like a big village with about one thousand (1000) families as a place of residence for the officials, employees and workers of the construction of Nagarjuna Sagar Dam. Sriman K. Janardhana Reddy (SE), one of the officials there, had a good dream in the early morning of 5-4-1984. Bhadradri is the realization of Rama in that dream. A temple was ordered to be built on this big mound. Reddy was surprised. The next morning, a big meeting was held and the dream fortune was explained to everyone. The happiness of everyone in the camp colony knows no bounds. Everyone joyfully declared their approval with Jaishreeram chanting with open voice. Everyone examined the mound and decided a place for the Ram Temple on a level ground. Within six months, the mound was converted to suit the construction of the temple. Magha Shuddha Dashami Thursday Rohini Nakshatra Yukta Kumbha Lagna Pushkaramsa i.e. 31-1-1985 AM || At 8.44 PM, the conch-laying moment for Sri Ram's temple was decided. 3 Under the supervision of Sri Sri Sri Nirishesh Sivanandagiri Swami, the founders of Brahmanishta who came to the area by an unexpected fortune, Bhumi Puja and Conch installation were done by Shriman Koti Ramakrishnamacharya who was the then head of Sri Bhadrachal Kshetra and his entourage in Sri Pancharatragama Sastrok. Amidst everyone's joy, the temple was renamed as 'Ramagiri' as the temple of Sri 'Sitaramanjaneyaswamy'. It is not the influence of dreams or the influence of the place but surprisingly, while it was in the construction stage, all the great leaders and spiritual gurus visited this Ramagiri and gave their blessings. Among them Srimukhu Sri Sringeri prefects Shankaracharya Sri Sri Bharti Teerdhananda Swami, Sri Sri Sri Sundara Chaitanyananda Swami (Dhavaleshwaram), Throughout the construction period of the temple, that Ramagiri was resounding with continuous Akhanda Hare Rama nama bhajans, recitations and bhajans of Shri Hanuman Chalisa. This Ramagiri Dasanjaneya is the most glorious figure. Sri Rama Nama Dipti. The gong of those who seek it is gold. Shelter for those who take shelter. The mandala is a miracle deity that fulfills all the desires of those who circumambulate the days with devotion. This Dasanjaneya is the character of Sri Ramanugraha who bestows everything be it Ayuraragyala, riches, Bhoga Bhagya and Bhakti prapattu. He is the ruler of this field and the protector of the field. Every Tuesday Sahasra Nama Puja is performed to this Swami with thousand betel leaves. It removes all the clutter. Gets all the benefits. Panchanga Shravana on every Ugadi, Angaranga Vaibhoganga Sitarama Kalyana Mahotsava on Sri Rama Navami, Brahmotsavam from Chaitra Shuddha Prashti to Dwadashi, Sri Hanumajjayanti Utsavam in the month of Vaisakh, Sri Goda Thirunakshatrotsavam in the month of Shravana, Sri Krishnashtami Utsavam in the month of Aswayuja Their Navratri celebrations, Vijaya Dashami Seva, City Sankirtans, Vanabhojanams, Dhanurmasa Mahotsavas in the month of Kartika Sri Goda Kalyanotsava, Sri Vaikuntha Ekadashi Uttara Dwara Darshan Festival on Maghasuddha Pushyami Sri Rama Pattabhishekotsava on Phalguna Purnima Uttara Nakshatra In this way, Ramagiri Kshetra is full of festivity of Sri Rajya Lakshmi. Sri Ramanujiya Vaishnava Tenkakai is the essence of Sri Pancharatri Divyagama Sasra. According to the tradition, Ramagiri Sitarams receive all kinds of services and become gold for those who measure them. Sri Dasanjaneya Swamy who is the Sevadhurandhar of Sitarama Pada is luxuriating as the benefactor of all the devotees. ' తిరుమల క్షేత్రానికి గడప వంటి కడప ఎటువంటిదో శ్రీ భద్రాచల క్షేత్రమునకు గుమ్మం వంటిది. ఈ ఖమ్మం. ప్రాచీన కాలంలో స్తంభాద్రిగా కీర్తించబడిన ఈ ప్రాంతం ఖమ్మం మెట్టుగా గొప్ప చారిత్రక నేపథ్యాన్ని కలిగియున్నది. స్తంభోద్భూతుడైన నరసింహస్వామి వెలసియున్న కొండయే స్తంభాద్రి ఆ స్తంభాద్రిని అధిరోహించుటకై మెట్టుగా ఏర్పడిన జనపదమే ఖమ్మం మెట్టుగా ప్రసిద్ధమై కాలక్రమేణ ఖమ్మం నగరంగా విలసిల్లుతోంది. ఆ స్తంభాద్రికి వెనుక భాగంలోని ప్రాకృతికంగా ఏర్పడిన పెద్ద గుట్టయే రామగిరి. ఈ గుట్ట రామగిరి క్షేత్రంగా ఏర్పడడానికి ఓక దైవఘటన కారణం. ఏ క్షేత్రం యొక్క ఆవిర్భావానికైనా మూడు ప్రధాన కారణాలుంటాయి మహర్షుల తపస్సు మహాభక్తుల తపన మూడవది భగవత్సంకల్పం. ఆ భగవకత్సంకల్పమే ఈ రామగిరి క్షేత్రావిర్భావానికి ప్రధాన బీజమైంది. 1975 సం॥లో నాగార్జున సాగర్ డ్యాం నిర్మాణానికి చెందిన అధికారులు, ఉద్యోగులు, కార్మికుల నివాస స్థలంగా సుమారు వెయ్యి (1000) కుటుంబాలతో మహా గ్రామంలా M.S.P క్యాంపు గా వెలిసింది ఈ రామగిరి ప్రాంతం. అక్కడి అధికారగణంలో ఒకరైన శ్రీమాన్ కె.జనార్ధన రెడ్డి (SE) గారికి ది.5-4-1984 తెల్లవారుఝామున ఒక శుభ స్వప్నం కలిగింది. ఆ స్వప్నంలో భద్రాద్రి రాముని సాక్షాత్కారం. ఈ పెద్ద గుట్టపై ఒక రామాలయాన్ని నిర్మించమని ఆదేశం. ఆశ్చర్యపోయారు రెడ్డి గారు. మరునాడు ఉదయమే మహా సమావేశాన్ని పెట్టి అందరికీ ఆ స్వప్న సౌభాగ్యాన్ని వివరించారు. క్యాంపు కాలనీలోని వారందరి ఆనందానికి అవధుల్లేవు. ముక్త కంఠంతో జైశ్రీరామ్ నినాదంతో అందరూ తమ ఆమోదాన్ని ఆనందంగా ప్రకటించారు. అందరూ గుట్టను పరుశీలించి సమతల ప్రదేశంలో రామాలయానికి స్థలాన్ని నిర్ణయించుకున్నారు ఆరు నెలల కాలంలోనే ఆ గుట్టను ఆలయ నిర్మాణానుకూలంగా తిర్చిదిద్దారు. మాఘ శుద్ధ దశమి గురువారం రోహిణీ నక్షత్ర యుక్త కుంభ లగ్న పుష్కరాంశము అనగా ది.31-1-1985 ఉదయం గం|| 8.44 ని॥లకు శ్రీరాముల వారి గుడికి శంఖుస్థాపన ముహుర్తాన్ని నిర్ణయించుకున్నారు. 3 అనుకోని భాగ్యంగా ఆ ప్రాంతానికి విచ్చేసిన బ్రహ్మనిష్టా శ్రమస్థాపకులు, పరమ పూజ్యలు అయిన శ్రీ శ్రీ శ్రీ నిర్యిశేష శివానందగిరి స్వాముల వారి పర్యవేక్షణలో శ్రీమాన్ జనార్ధన రెడ్డి దంపతుల చేతుల మీదుగా భూమి పూజ, శంఖుస్థాపనలు అప్పటి శ్రీ భద్రాచల క్షేత్రం ప్రధానార్చుకులైన శ్రీమాన్ కోటి రామకృష్ణమాచార్యుల వారు, వారి పరివారముచే శ్రీ పాంచరాత్రాగమ శాస్త్రోక్తంగా జరిగాయి. అందరి ఆనందాల మధ్య ఆ గుడికి శ్రీ " 'సీతారామాంజనేయస్వామి దేవాలయంగా ఆ గుట్టకు 'రామగిరి' గా నామకరణములు జరిగాయి. స్వప్న ప్రభావమో, స్థల ప్రభావమో కాని ఆశ్చర్యకరముగా నిర్మాణ దశలో ఉండగానే మహా పీఠాధిపతులు, ఆధ్యాత్మిక గురువులెందరో ఈ రామగిరిని దర్శించి ఆశీస్యులను అందించారు. వారిలో శ్రీముఖులు శ్రీ శృంగేరి పీఠాధిపతులు శంకరాచార్యులు అయిన శ్రీ శ్రీ భారతీ తీర్ధానందస్వామి వారు, శ్రీ శ్రీ శ్రీ సుందర చైతన్యానంద స్వామి వారు (ధవళేశ్వరం), ఆలయ నిర్మాణ కాలమంతా ఆ రామగిరి నిరంతర అఖండ హరే రామ నామ భజనలతో శ్రీ హనుమాన్ చాలీసా పారాయణలతో, భజనలతో మారు మ్రోగుతుండేది. ఈ రామగిరి దాసాంజనేయుడు అత్యంత మహిమాన్వితమైన మూర్తి. శ్రీరామ నామ దీప్తి. కోరిన వారి కొంగు బంగారం. ఆశ్రయించిన వారికి అభయాకారం. మండలం రోజులు నిష్టతో ప్రదక్షిణాలు చేసేవారికి అన్ని కోర్కెలనూ తీర్చే అద్భుతదైవం. ఆయురారోగ్యాలయినా, ధనధాన్యాలయినా, భోగ భాగ్యలైనా, భక్తి ప్రపత్తులనైనా అన్నింటినీ ప్రసాదించే శ్రీ రామానుగ్రహ పాత్రుడు ఈ దాసాంజనేయుడు. ఈ క్షేత్ర పాలకుడూ ఆయనే క్షేత్ర రక్షకుడూ ఆయనయే. ప్రతి మంగళవారం ఈ స్వామి వారికి వెయ్యి తమలపాకులతో సహస్ర నామ పూజ జరుగును. ఇది సకలారిష్టాలను తొలగిస్తుంది. సకలాభీష్టాలను పొందిస్తుంది. ప్రతి ఉగాది నాడు పంచాంగ శ్రవణం, శ్రీరామ నవమి నాడు అంగరంగ వైభోగంగా సీతారామ కళ్యాణ మహోత్సవము, చైత్ర శుద్ధ ప్రష్టి నుండి ద్వాదశి వరకు బ్రహ్మోత్సవములు, వైశాఖ మాసంలో శ్రీ హనుమజ్జయంతి ఉత్సవము, శ్రావణ మాసంలో శ్రీ గోదా తిరునక్షత్రోత్సవము, శ్రావణ శుక్రవారోత్సవములు, శ్రీ కృష్ణాష్టమి ఉత్సవము, ఆశ్వయుజ మాసంలో శ్రీ రాజ్యలక్ష్మీ అమ్మ వారి నవరాత్రోత్సవములు, విజయ దశమి సేవ, కార్తీక మాసంలో నగర సంకీర్తనలు, వనభోజనములు, ధనుర్మాస మహోత్సవములు శ్రీ గోదా కళ్యాణోత్సవము, శ్రీ వైకుంఠ ఏకాదశీ ఉత్తర ద్వార దర్శనోత్సవము మాఘశుద్ధ పుష్యమి నాడు శ్రీ రామ పట్టాభిషేకోత్సవము, ఫాల్గుణ పూర్ణిమ ఉత్తరా నక్షత్రం నాడు శ్రీరాజ్య లక్ష్మీ అమ్మవారి తిరు నక్షత్రోత్సవములు ఈ విధంగా నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఈ రామగిరి క్షేత్రం సర్వోత్సవ సంపూర్ణముగా విలసిల్లుచున్నది. శ్రీ పాంచారాత్రి దివ్యాగమ శాస్రాను సారముగా శ్రీ రామానుజీయ వైష్ణవ తెన్కకై. సంప్రదాయానుగుణముగా రామగిరి సీతారాములు సర్వవిధసేవలను స్వీకరించుచు కొలిచిన వారికి కొంగు బంగారమై విరాజిల్లుచున్నారు. ఆ సీతారామ పాద సేవాధురంధరుడైన శ్రీ దాసాంజనేయ స్వామి భక్తులందరికీ వరప్రదాతగా విలసిల్లుచున్నారు. '
- Sub Temples 🛕 Sriram Temple 🛕 శ్రీరామ దేవాలయం
- Things to Cover 🙏🏼Take darshan of Lord Sriram 🙏🏼శ్రీరాముని దర్శనం చేసుకోండి
- Dress Code 🥻Traditional Dress 🥻సాంప్రదాయ దుస్తులు
- Pooja Details 🌹Nitya Gotra Namarchana - 5116/- 🌹Upanayanam - 1116/- 🌹Barasala / Shanti - 516/- 🌹Astotharam - 20/- 🌹Sahasra namarchana - 50/- 🌹Sri Anjaneya Swamy Aaku Pooja - 50/- 🌹Anna prasana / Aksharabhyasam - 150/- 🌹Four wheeler Pooja - Car, Lorry , Bus - 300/- 🌹Two wheeler Pooja - 100/- 🌹Cycle Pooja - 20/- 🌹Pulihora - 300/- 🌹Chakkara Pongal - 450/- 🌹Ksheerannam - 300/- 🌹నిత్య గోత్ర నామార్చన - 5116/- 🌹ఉపనయనం - 1116/- 🌹బారసాల / శాంతి - 516/- 🌹అస్తోత్రం - 20/- 🌹సహస్ర నామార్చన - 50/- 🌹శ్రీ ఆంజనేయ స్వామి ఆకు పూజ - 50/- 🌹అన్న ప్రాసన / అక్షరాభ్యాసం - 150/- 🌹ఫోర్ వీలర్ పూజ - కారు, లారీ , బస్సు - 300/- 🌹ద్విచక్ర వాహనం పూజ - 100/- 🌹చక్ర పూజ - 20/- 🌹పులిహోర - 300/- 🌹చక్కర పొంగల్ - 450/- 🌹క్షీరాన్నం - 300/-
- Festivals / Jaatra Panchanga Shravana on every Ugadi, Angaranga Vaibhoganga Sitarama Kalyana Mahotsava on Sri Rama Navami, Brahmotsavam from Chaitra Shuddha Prashti to Dwadashi, Sri Hanumajjayanti Utsavam in the month of Vaisakh, Sri Goda Thirunakshatrotsavam in the month of Shravana, Sri Krishnashtami Utsavam in the month of Aswayuja Their Navratri celebrations, Vijaya Dashami Seva, Sankirtans in the month of Kartika, Vanabhojanams, Dhanurmasa Mahotsavam, Sri Goda Kalyanotsavam, Sri Vaikuntha Ekadashi Uttara Dwara Darshanotsavam, Sri Rama Pattabhishekotsavam on Phalguna Purnima Uttara Nakshatram, Srirajya Lakshmi Ammavari Thiru Nakshatratsavam is thus a green temple Sarvotsava completely Blooming ప్రతి ఉగాది నాడు పంచాంగ శ్రవణం, శ్రీరామ నవమి నాడు అంగరంగ వైభోగంగా సీతారామ కళ్యాణ మహోత్సవము, చైత్ర శుద్ధ ప్రష్టి నుండి ద్వాదశి వరకు బ్రహ్మోత్సవములు, వైశాఖ మాసంలో శ్రీ హనుమజ్జయంతి ఉత్సవము, శ్రావణ మాసంలో శ్రీ గోదా తిరునక్షత్రోత్సవము, శ్రావణ శుక్రవారోత్సవములు, శ్రీ కృష్ణాష్టమి ఉత్సవము, ఆశ్వయుజ మాసంలో శ్రీ రాజ్యలక్ష్మీ అమ్మ వారి నవరాత్రోత్సవములు, విజయ దశమి సేవ, కార్తీక మాసంలో నగర సంకీర్తనలు, వనభోజనములు, ధనుర్మాస మహోత్సవములు శ్రీ గోదా కళ్యాణోత్సవము, శ్రీ వైకుంఠ ఏకాదశీ ఉత్తర ద్వార దర్శనోత్సవము మాఘశుద్ధ పుష్యమి నాడు శ్రీ రామ పట్టాభిషేకోత్సవము, ఫాల్గుణ పూర్ణిమ ఉత్తరా నక్షత్రం నాడు శ్రీరాజ్య లక్ష్మీ అమ్మవారి తిరు నక్షత్రోత్సవములు ఈ విధంగా నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఈ రామగిరి క్షేత్రం సర్వోత్సవ సంపూర్ణముగా విలసిల్లుచున్నది
- Travel Guide This temple is around 500 meters from Khammam new bus stand. Either you can walk to this temple or take shared auto. When you visit this temple you can also visit other near by temples in Khammam 🛕Abhaya Venkateswara Swamy Temple Khanapuram 🛕Sri Ramalayam Parnasala 🛕Sri Raja Rajeshwari Ammavai devastanam Rotary nagar 🛕Sri Stambhadri Nara Simha Swamy Temple 🛕Sri Kala Saibaba ఈ ఆలయం ఖమ్మం కొత్త బస్టాండ్ నుండి 500 మీటర్ల దూరంలో ఉంది. మీరు ఈ ఆలయానికి నడిచి వెళ్లవచ్చు లేదా షేర్డ్ ఆటోలో వెళ్లవచ్చు. మీరు ఈ ఆలయాన్ని సందర్శించినప్పుడు మీరు ఖమ్మంలోని ఇతర ఆలయాలను కూడా సందర్శించవచ్చు 🛕అభయ వెంకటేశ్వర స్వామి ఆలయం ఖానాపురం 🛕శ్రీ రామాలయం పర్ణశాల 🛕శ్రీ రాజ రాజేశ్వరి అమ్మవాయి దేవస్థానం రోటరీ నగర్ 🛕శ్రీ స్తంభాద్రి నరసింహ స్వామి ఆలయం 🛕శ్రీ కాళ సాయిబాబా
Opening Hours
Monday:
6:00 AM - 11:00 AM & 5:00 PM - 8:00 PM
Tuesday:
6:00 AM - 11:00 AM & 5:00 PM - 8:00 PM
Wednesday:
6:00 AM - 11:00 AM & 5:00 PM - 8:00 PM
Thursday:
6:00 AM - 11:00 AM & 5:00 PM - 8:00 PM
Closed
Friday:
6:00 AM - 11:00 AM & 5:00 PM - 8:00 PM
Saturday:
6:00 AM - 11:00 AM & 5:00 PM - 8:00 PM
Sunday:
6:00 AM - 11:00 AM & 5:00 PM - 8:00 PM
FAQ's
Do we have parking?
Yes, this temple has sufficient parking place at the hill and at the bottom of the hill also.
Is there a kalyana manadapam at this temple?
Yes, there is a kalyana mandapam at this temple