Sri Dattachala Kshetram , Madhura, Telangana 502314
Sri Dattachala Kshetram , Madhura, Telangana 502314
శ్రీ దత్తాచల క్షేత్రం, మధుర, తెలంగాణ 502314
Maps
Contact
Hightlight
- Parking
- Taxi
More Information
- Temple History ఒక అతి రహస్యమైన దత్తక్షేత్రమనీ , శ్రీపాదుడు తన పాద స్పర్శతో పునీతం చేసిన ప్రదేశమనీ, నరసింహ సరస్వతి స్వామివారు 12 సంవత్సరాలు రహస్యంగా తపస్సు చేసిన ప్రాంతమనీ, గురుచరిత్ర వ్రాసిన నామధారకుడు తన అంత్యకాలంలో ఇక్కడే గడిపారు. దత్తాచలక్షేత్రం (దత్తాలయగుట్ట) మెదక్ జిల్లా లో నర్సాపూర్ కు దగ్గర లో గల హత్నురా మండలం లోని Madhira (Maadaram Village) మాధిర (మాదారం) గ్రామ శివార్లలో ఉంది. దత్తాచలక్షేత్రం (దత్తాలయగుట్ట) ను సొంత వాహనాలలో ప్రయాణించి సులభంగా చేరుకోవచ్చు. హైదరాబాద్ నుండి దాదాపుగా 100 కీ.మీ. దూరం ఉంటుంది. అక్కడి ప్రజలని రూట్ అడిగేటప్పుడు ‘మాధిర’ కు బదులుగా ‘మాదారం’ అని అడిగితే సులభంగా గుర్తుపడతారు. టూవీలర్ మీద వెళ్ళేవారు హత్నురా ITI లోపల నుండి / ఫోర్ వీలర్ పై వెళ్ళేవారు ITI పక్కనగల మట్టి రోడ్డు ద్వారా సులభంగా దత్తాచలక్షేత్రం (దత్తాలయగుట్ట) ను చేరుకోవచ్చు. ఏక పాద దత్తక్షేత్రం శ్రీపాద శ్రీ వల్లభులు తమ 16వ ఏటా పిఠాపురంలో సన్యాస దీక్ష తీసుకోని, ఇంటినుండి బయలుదేరి ఉత్తరదేశ ముఖంగా వెళ్లి అనేక క్షేత్రాలను దర్శించి తరువాత గోకర్ణం చేరి అక్కడ 3 సంవత్సరాలకాలముండి, దత్తాచలం చేరి అక్కడి గుహలలో గల మహాసిద్ధులను ఆశీర్వదించి, దగ్గరలో గల మంజీరా నదిలో స్నానమాచరించి, దత్తాచలక్షేత్రం మీదుగా శ్రీశైలం చేరారని ఇక్కడి స్థల పురాణం. నరసింహ సరస్వతి స్వామివారు 12 సంవత్సరాలు రహస్యంగా తపస్సు చేసిన ప్రదేశమిది నరసింహ సరస్వతి స్వామి వారి ముఖ్య శిష్యుడు మరియు గురుచరిత్ర వ్రాసిన నామధారకుడు తన అంత్యకాలం మొత్తం ఇక్కడే గడపడం విశేషం మంజీరానది కి (సుమారు 8 కీ.మీ. దూరంలో) సమీపం లో గల దత్తక్షేత్రం దత్తాలయగుట్టకు సమీపంలోనే అన్ని విధాలా కాశీ విశ్వేశ్వరుడిని పోలిఉన్న కాశీపతి దేవాలయం కలదు. ఈ గుడి వద్దనే శ్రీగురుని ఏక పాదముద్ర గలదు శ్రీచక్రాన్ని కలిగి ఉన్న ఏకైక దత్తాత్రేయుడు ఇక్కడ శ్రీచక్ర సహిత దత్తాత్రేయుడు కొలువుతీరి ఉండడం వల్ల ఈక్షేత్రం “మహిళా దత్తక్షేత్రం” గా వెలుగుతోంది (ఇక్కడి గుడి నిర్మాణ కార్యక్రమమును ప్రారంబించింది కుడా ఒక మహిళా మంత్రే!) ఇక్కడ న్యాయబద్ధమైన కోరిక కోరిన మహిళలు, అవి తీరకుండా నిరాశ పొందిన మహిళ ఒక్కరు కుడా లేరట. ఇక్కడ కొలువుతీరిన దత్తుడి రూపం మనం ఊహించనిదిగా, ముందెప్పుడూ చూడని విధంగా ఉంటుంది. రెండవ దత్తావతారమైన శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారు గాణ్గాపురము నందు ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని వారి వద్ద గల శిష్యులకు సనాతన ధర్మములను ఉపదేశించేవారు. వారి శిష్యగణంలో అతి ముఖ్యమైనవారు శ్రీ నామాధారకులు. నామధారాకుల వారు గురు ఆశీర్వాదం మెండుగా కలిగినవారు, మరియు గృహస్తు కుడా. వారు అనేక వేదములను అధ్యయనం చేసి, శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారి సేవలో గడిపి శ్రీగురుని (శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారు) వద్ద నుండి అనేక గురుసేవా రహస్యాలను తెలుసుకున్న దత్తదైవాంశ సంభూతులు. అలాగే గురు చరిత్రను మనకి అక్షర రూపంలో అందించినది కుడా ఈయనే. ఇటువంటి స్థితిలో గల నామధారాకుల వారు శ్రీగురుని విడిచి క్షణమైనా ఉండలేకపోయేవారు. ఒకానొక సమయంలో శ్రీగురుడు (శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారు) 12 సంవత్సరాల పాటు గాణ్గాపురమును విడిచి తపస్సు చేసుకొనుటకు వేరే ప్రాంతానికి వెళతారు. ఆ ‘గురు ఎడబాటు’ తట్టుకోలేని నామధారకుడు గురువు గారి జాడ కోసం అనేక ప్రయత్నాలు చేసి ఆఖరుకు శ్రీగురుడు దత్తాచలక్షేత్రం లో తపస్సు చేసుకొంటున్నట్లుగా తెలుసుకుంటారు. ఆ తరువాత ఒకానొక మాఘ బహుళ పాడ్యమి రోజు శ్రీగురుడు నిర్హరితం చెందినట్లుగా తెలుసుకొని ఎంతో దుఃఖించి, విరక్తి చెంది, ముందు లాగే మళ్లీ ఎలాగైనా దత్తాచలక్షేత్రం లో కనబడవచ్చనే నమ్మకంతో దత్తాచలం వచ్చి శ్రీగురుని కోసం ఘోరంగా తపస్సు చేస్తారు. నామధారాకుల వారి అచంచల గురు భక్తికి మెచ్చి శ్రీచక్ర సమేతంగా శ్రీదత్తాత్రేయుల వారు ప్రత్యక్షమై, వెంటనే శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారిగా దర్శనమిచ్చి జనన-మరణ-వైరాగ్య బోధనలను ఉపదేశించి, వారి పాదుకలను (నిర్గుణ పాదుకలు – ప్రస్తుతం మనం చూసే నిర్గుణ పాదుకలు అవే) శ్రీ నామధారాకులవారికిచ్చి, వాటిని గాణ్గాపుర ఆశ్రమంలో ప్రతిష్టించి నిత్యపూజలు చేస్తూ సనాతనధర్మములను భక్తులకు భోదించమని చెప్పి అంతర్ధానమవుతారు. అంతట శ్రీగురుని ఆదేశానుసారం శ్రీ నామదారకులు శ్రీగురుని పాదుకలను ప్రతిష్టించి సనాతనధర్మప్రచారం చేస్తూ కాలం గడుపుతారు. శ్రీ నామదారకులు వృద్దాప్యం లోకి వచ్చిన తరువాత మళ్లీ శ్రీగురుని వెతుక్కుంటూ దత్తాచలం చేరి దత్తాచలగుట్ట వద్ద గల దత్తకొలను లో నీటి మీద కుర్చుని అన్న, పానీయాలు మాని శ్రీగురుని దర్శనభాగ్యం కోసం తపోనిష్టలో ఉండేవారు. దాదాపుగా అదే సమయంలో ఆ ప్రాంతాన్ని పాలించే నవాబ్ (రాజు – King) గారి ఒక్కగానొక్క కూతురికి రాచపుండు (Cancer) వ్యాధి వస్తుంది. అప్పుడు ఆ నవాబ్ గారు కూతురుని బతికించమని అనేక మంది వైద్యులను కలుస్తారు. అందరు వైద్యులు కుడా ఈ జబ్బు తగ్గదని, త్వరలోనే మరణం తధ్యమని చెపుతారు. అయినప్పటికీ నవాబ్ గారు ఏదైనా ఉపాయం చెప్పమని వైద్యులని వేడుకుంటాడు. ఆ వైద్యులలో ఒక వైద్యుడు ” మీ కూతురు మరణించకుండా ఆపలేము కాని ఆ మరణాన్ని వాయిదా వేయుటకు ఒక సలహాగలదు” అని చెపుతాడు. అంతట ఆ నవాబ్ గారు ఆ సలహా ఏమిటో చెప్పమని వేడుకొనగా “మీ కూతురిని నగర కాలుష్యం నుండి దూరంగా అడవికి తీసుకుని వెళ్లి అక్కడ లభించే సహజ ఫలాలు, తెనేవంటివి ఇస్తే మరొక రెండు నెలలు బ్రతకవచ్చు” అని సలహా ఇస్తాడావైద్యుడు. వెంటనే నవాబ్ గారు రాజ్యాన్ని వారి తమ్ముడికి అప్పజెప్పి కొంత మంది పని వారిని తీసుకోని కూతురితో సహా దట్టమైన అడవులలోకి వెళతారు. పనివారు ఆహార సేకరణ లో భాగంగా దత్తాచలగుట్ట దగ్గరకు వస్తారు. అక్కడ గల కొలనులో నీటి మీద కుర్చుని తపోనిష్ట లో ఉన్న శ్రీ నామదారకుడిని చూసి, ఆశ్చర్యపోయి ఆ సమాచారాన్ని నవాబ్ గారికి అందిస్తారు. అప్పుడు ఆ నవాబ్ గారు నీటి మీద కుర్చుని తపోనిష్ట లో ఉన్న శ్రీ నామదారకుడిని చూసి, ఆయన వద్దకు వెళ్ళాలా? వద్దా? పైగా ఆయన హిందూ మతస్తుడు, నేనేమో మహామ్మదియుడిని అని ఆలోచిస్తారు, ఈయన ఎలాగైనా నా కూతురుని రక్షించగలరని మనసులో అనుకోని శ్రీ నామదారకుడి వద్దకు వెళతారు, తమ కూతురిని రాచపుండు (Cancer) వ్యాధి నుండి రక్షించమని వేడుకుంటారు. దానికి సమాధానంగా శ్రీ నామదారకుడు “అయ్యా రాజు గారు, నేను ఒక సాధారణ బ్రాహ్మణుడను. నావద్ద ఎలాంటి మంత్ర విద్యలు కాని, వైద్య విద్యలు కాని, సంజీవిని కాని లేదు. జీవితం పై విరక్తి చెంది, పెళ్ళాం బిడ్డలను వదిలి సన్యశిస్తున్న సాధారణ సన్యాసిని నేను, తపోభంగం కలిగించవద్దు దయచేసి వెళ్ళిపోండి” అని చెబుతారు. నవాబ్ గారు ఆరోజుకు వెళ్లి పోయినా ఆరోజు నుండి ప్రతీ రోజు వచ్చి శ్రీ నామదారకుల వారిని తగిన నివారణోపాయాన్ని తెలపమని ప్రార్ధిస్తూనే ఉంటారు. ఆఖరుకు ఒక రోజు శ్రీ నామదారకుల వారు ఈ దత్తకొలను లోని నీటిని తీసుకువెళ్లి మీ కూతురికి త్రాగించి, రాచపుండు కురుపును (Cancer Wound) రోజూ కడుగుతూ ఉంటే శ్రీగురుని దయతో నయం అవుతుందని చెపుతారు. శ్రీ నామదారకుల ఆజ్ఞానుసారం ప్రతీ రోజూ నవాబ్ గారు వారి కూతురికి దత్తకొలను లోని నీటిని తీసుకు వెళ్లి త్రాగించి, రాచపుండు కురుపును (Cancer Wound) కడుగుతూ ఉండగా కొద్ది రోజులలనే ఆమె సంపూర్ణ ఆరోగ్యవంతురాలైంది. సంపూర్ణ ఆరోగ్యవంతురాలైన కూతురుని తిరిగి రాజ్యంలో దిగబెట్టి సంతోషంతో నవాబ్ గారు దత్తాచలం చేరి శ్రీ నామదారకుల వారిని కలసి ఏమైనా బహుమతి కోరుకోనమనగా సన్యాసి అయిన నాకు ఏమి అవసరం లేదని, ఏదైనా ఉంటే దత్తుడికి ఇచ్చుకోమని, దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని చెబుతాడు. అంతట ఆ నవాబ్ గారు దత్తాచలగుట్ట నుండి అష్టదిక్కులలో ఎటు చూసినా 1000 ఎకరాల భూమి స్వామీ వారి పేరు మీద రాగి పత్రాల పై రాయించి అక్కడ పెట్టి వెళ్లిపోతాడు. ఆవిధంగా శ్రీ నామదారకుల వారి పేరు ఇతరప్రాంతాలకు వ్యాపించింది. శ్రీ నామదారకుల వారి జాడ తెలిసిన వారి భార్య- పుత్రులు దత్తాచలక్షేత్రం వచ్చి కుటుంబ పోషణ కష్టంగా ఉంది, దయచేసి సన్యాసదీక్ష విరమించవలసిందిగా కోరతారు. అందుకు ససేమిరా అన్ననామదారకుడు ఈ గుట్టకు దూరంగా నవాబ్ గారు ఇచ్చిన 1000 ఎకరాల భూమిలో కేవలం ఉదార పోషణ నిమిత్తం ఎంత అవసరమో అంత భూమిని మీరు సాగుచేసుకోవచ్చని చెప్పి, తనకు మాత్రం తపోభంగం కలిగించవద్దని , తాను అనతి కాలంలోనే గొప్ప ఆధ్యాత్మిక స్థితికి చేరుకోబోతున్నట్లుగా చెప్పి దత్తాచలక్షేత్ర గుట్ట మీద గల గుహలో తీవ్ర తపమాచరించడానికి సమాయత్తమవుతారు. ఆ విధంగా కొన్ని సంవత్సరాలు గడచిన తరువాత ఒక రోజూ వారి కుమారుడైన శ్రీ సూర్యభట్టు కు స్వప్నంలో శ్రీ నామదారకుల వారు కనబడి “కుమారా… నేను దత్తాత్రేయస్వామీలో లయం చెందాను. దత్తుడుకి ప్రతీ సంవత్సరం మార్గశీర్ష శుద్ధ షష్టి నుండి మార్గశీర్ష పౌర్ణమి వరకు (దత్త జయంతి) ఉత్సవాలు జరిపి, చివరి రోజైన దత్త జయంతి రోజున అన్నసంతర్పణ జరిపించవలసిందిగా మనవి” అని చెపుతారు. శ్రీ నామదారకుల వారు దత్తాత్రేయునిలో లయం చెందిన కారణంగా ఈ ప్రాంతాన్నే “దత్తాలయగుట్ట” అనికూడా పిలుస్తారు. శ్రీ నామదారకుల ఆదేశానుసారం నాటినుండి (600 సంవత్సరాల నుండి) నేటి వరుకు వారి వంశస్థులు ప్రతీ సంవత్సరం ఉత్సవాలను జరుపుతున్నారు. శ్రీ నామదారకుల వారిని లయం చేసుకోవడానికి విచ్చేసిన శ్రీగురుడు (శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారు) మొదటి పాదం మాధురగ్రామ పరిసరాల్లో గల కాశీపతి దేవాలయం దగ్గర పెట్టగా రెండవపాదం దత్తాచలగుట్ట మీద మొదటి పాదానికి అభిముఖంగా పెడతారు. ఈ రెండు చోట్లా ఏకపాద ముద్రలే ఇక్కడ ఉంటాయి, మరియు ఈ రెంటి మధ్య సుమారు 1 కీ.మీ. పైన దూరం ఉంటుంది. ఇవి శ్రీగురుని అసలైన పాదముద్రలు. వెంటనే శ్రీ నామదారకులు దత్తాచలగుట్ట పై రెండవ పాదముద్రను ప్రతిష్టించి శ్రీగురునిలో లయంఅవుతారు. ఆశ్చర్యపరిచే ప్రత్యక్ష నిదర్శనాలు ప్రతీ పౌర్ణమి మరియు అమావాస్యలకి ఇక్కడ అర్ధరాత్రి 2.00 గంటల నుండి 2.30 గంటల మధ్య ఈ గుట్టలో ‘ఓం’ కార శబ్దం ధ్వనిస్తుంది. శక్తి, ధైర్యం,ఈ ఓంకార శబ్దాన్ని వినాలనుకునే ఆశక్తిగల వారు ఇక్కడి పూజారి అయిన శ్రీ సభాపతిశర్మ గారికి చెబితే వారు మీరు రాత్రికి దత్తాచలగుట్ట మీద ఉండడానికి బస ఏర్పాటు చేస్తారు. దత్తాచలగుట్ట మీద వెలసిన దత్తాత్రేయుని పాదముల వద్ద మన చెవిని ఆనించి ప్రశాంతంగా వింటే అన్నివేళలా “ఓం” కార శబ్దం వినిపిస్తుంది. మనుష్య సంచారం ఉండని సాయంత్ర వేళల్లో, తెల్లవారు ఝామున భయానకరూప దిగంబరులని మనం ఇక్కడ ప్రత్యక్షంగా చూడవచ్చు. అప్పట్లో నవాబ్ గారు రాసిచ్చిన 1000 ఎకరాల భూమి లో ప్రస్తుతం 10 ఎకరాలు మాత్రమే మిగిలింది. ఈ 10 ఎకరాలూ “శ్రీ దత్తాత్రేయ స్వామి” వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయబడినది. ఆ రిజిస్ట్రేషన్ పేపర్లను మనం చూడవచ్చు. ( గడచిన 600 సంవత్సరాలలో నవాబులు పోయారు, నిజాం పాలన పోయింది, బ్రిటీష్ పాలన పోయింది, ఇండియన్ గవర్నమెంట్ వచ్చింది, మద్రాస్ తో పాటు ఉన్న ఉమ్మడి రాష్ట్రం పోయింది, కర్నూల్ రాజధాని మారి హైదరాబాద్ వచ్చింది, కరణీకం పోయింది – ఇన్ని మార్పులు రావడం వల్ల రికార్డులు మార్చి విలువైన దత్తాత్రేయుని భూమి కబ్జా చేయబడినది) It is a very secret Datta Kshetra, a place where Sripada sanctified it with the touch of his feet, a place where Narasimha Saraswati Swami secretly meditated for 12 years, and the author of Gurucharitra spent his last days here. Datta Chalakshetra (Dattalayagutta) is located on the outskirts of Madhira (Maadaram Village) in Hatnura Mandal, near Narsapur in Medak district. Datta Chalakshetra (Dattalayagutta) can be easily reached by traveling in your own vehicle. It is about 100 km. from Hyderabad. It is easy to remember if you ask the people there for the route instead of ‘Madhira’. Those who are on two-wheelers can easily reach Dattachalakshetra (Dattalaygutta) from inside Hatnura ITI / those who are on four-wheelers can easily reach Dattachalakshetra (Dattalaygutta) by the dirt road next to ITI. One-foot Dattachalakshetra Sripada Sri Vallabhlu, who did not take monastic initiation in Pithapuram in his 16th year, left home and went towards the north and visited many places. After reaching Gokarna, he stayed there for 3 years. He reached Dattachalakshetra and blessed the great siddhis in the caves there. He took a bath in the nearby Manjira river and reached Srisailam via Dattachalakshetra. This is the place where Lord Narasimha Saraswati performed penance for 12 years in secret. It is noteworthy that the chief disciple of Lord Narasimha Saraswati and the author of Gurucharitra spent his entire last days here. Datta Kshetra is located near Manjira River (about 8 km away). Near Dattalayagutta is the Kashipati Temple, which resembles Kashi Vishweshwara in every way. The sole footprint of Sri Guru is located at this temple. Dattatreya is the only one who holds the Sri Chakra. Since Dattatreya is enshrined here with the Sri Chakra, this place is known as the “Women’s Datta Kshetra” (the temple construction program here was also initiated by a woman minister!) There are not a single woman who has asked for a legitimate wish here and has not been disappointed. The form of Datta that has taken root here is something we have never imagined and never seen before. The second incarnation of Datta, Shri Narasimha Saraswati Swami, established an ashram in Gangapuram and taught the Sanatana Dharma to his disciples. The most important of his disciples were the Shri Namadharakas. The Namadharakas were those who had the blessings of their Guru and were householders. They studied many Vedas, spent time in the service of Shri Narasimha Saraswati Swami and learned many secrets of Guru service from the Shri Guru (Shri Narasimha Saraswati Swami). He is also the one who gave us the history of the Guru in written form. In such a situation, the Namadharakas could not stay away from the Shri Guru even for a moment. At one point, Sri Guru (Sri Narasimha Saraswati Swami) left Gangapuram for 12 years and went to another place to do penance. Unable to bear the ‘separation of the Guru’, the name bearer made many attempts to trace the Guru and finally came to know that Sri Guru was doing penance in Dattachalam Kshetram. Then, one day, on the day of Magha Bahula Padyami, he came to know that Sri Guru had passed away and became very sad and disheartened. He came to Dattachalam and did penance for Sri Guru, believing that he would somehow be seen in Dattachalam Kshetram like before. Pleased with the unwavering devotion of the Namadharakas to their Guru, Sri Dattatreya appeared with Sri Chakra and immediately appeared as Sri Narasimha Saraswati Swami and taught them the teachings of birth, death and renunciation. He gave his Padukas (Nirguna Padukas - these are the Nirguna Padukas that we see today) to the Namadharakas and told them to install them in the Gangapura Ashram, perform daily pujas and teach the Sanatana Dharma to the devotees, and then disappeared. Then, as per the instructions of the Sri Guru, the Namadharakas installed the Padukas of the Sri Guru and spent their time preaching the Sanatana Dharma. After Sri Namadarakulu reached old age, he again went to Dattachalam in search of Sri Guru and sat on the water of Dattakolanu near Dattachalagutta, abstained from food and drink and performed penance for the sake of seeing Sri Guru. Around the same time, the only daughter of the Nawab (King) who ruled that area was suffering from cancer. Then the Nawab visited many doctors to save his daughter. All the doctors said that this disease would not go away and that death would soon follow. However, the Nawab begged the doctors to suggest some solution. One of the doctors said, “We cannot stop your daughter from dying, but we can suggest a way to postpone her death.” Then the Nawab asked him what the advice was, and the doctor advised him, “Take your daughter to the forest, away from the pollution of the city, and feed her with the natural fruits and nuts available there, so that she can live for another two months.” Immediately, the Nawab handed over the kingdom to his younger brother and went to the dense forests with some servants, along with his daughter. The servants came to Dattachalagutta as part of their food collection. They saw Shri Namadarakudi sitting on the water in the pond there, doing penance, and were surprised and informed the Nawab. Then the Nawab saw Shri Namadarakudi sitting on the water and doing penance, and asked whether he should go to him or not? Moreover, he was a Hindu, and he thought that I was a Mahamadi. He did not think that he could save his daughter in any way, so he went to Shri Namadarakudi, and took his daughter to the royal palace (Ca
- Sub Temples 🛕Sri Dattatreya Temple 🛕Lord Shiva 🛕Lord Hanuman 🛕శ్రీ దత్తాత్రేయ ఆలయం 🛕శివుడు 🛕హనుమంతుడు
- Things to Cover 🙏🏼Take darshan & blessings of Sri Dattatreya Swamy , Lord Shiva, Lord Hanuman 🙏🏼 శ్రీ దత్తాత్రేయ స్వామి, శివుడు, హనుమంతుడి దర్శనం మరియు ఆశీస్సులు పొందండి
- Dress Code 🥻Traditional Dress🥻సాంప్రదాయ దుస్తులు
- Festivals / Jaatra 🌹Datta Jayanthi 🌹దత్త జయంతి
- Travel Guide 🚌Dattachalakshetram (Dattalaygutta) can be easily reached by traveling in your own vehicles. It is about 100 km from Hyderabad. It is a distance. When asking the people there for the route, they will easily remember it if you ask them for ‘Madharam’ instead of ‘Madhira’. Those who go on two-wheelers can easily reach Dattachalakshetram (Dattalaygutta) from inside the Hatnura ITI / those who go on four-wheelers can easily reach Dattachalakshetram (Dattalaygutta) through the dirt road next to the ITI. 🚌దత్తాచలక్షేత్రం (దత్తాలయగుట్ట) ను సొంత వాహనాలలో ప్రయాణించి సులభంగా చేరుకోవచ్చు. హైదరాబాద్ నుండి దాదాపుగా 100 కీ.మీ. దూరం ఉంటుంది. అక్కడి ప్రజలని రూట్ అడిగేటప్పుడు ‘మాధిర’ కు బదులుగా ‘మాదారం’ అని అడిగితే సులభంగా గుర్తుపడతారు. టూవీలర్ మీద వెళ్ళేవారు హత్నురా ITI లోపల నుండి / ఫోర్ వీలర్ పై వెళ్ళేవారు ITI పక్కనగల మట్టి రోడ్డు ద్వారా సులభంగా దత్తాచలక్షేత్రం (దత్తాలయగుట్ట) ను చేరుకోవచ్చు.
FAQ's
Do we have parking?
Yes, there is plenty of parking available